మరీ ఇంత కొవ్వు పనికిరాదు.. పాక్ కెప్టెన్ సర్ఫరాజ్‌పై అక్తర్ ఫైర్

పాకిస్థాన్ క్రికెట్ జట్టు కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్‌కు కొవ్వు బాగా పెరిగిపోయిందట. ఈ మాటన్నది మరెవరో కాదు.. స్వయంగా ఆ దేశ మాజీ పేసర్ షోయబ్ అక్తర్. ప్రపంచకప్‌లో భాగంగా ట్రెంట్‌బ్రిడ్జ్‌లో శుక్రవారం విండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో పాక్ ఘోరాతిఘోరంగా ఓటమిపాలైంది. విండీస్ బౌలర్ల దెబ్బకు 21.4 ఓవర్లలోనే 105 పరుగులకే కుప్పకూలింది. 106 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన కరేబియన్లు కేవలం 13.4 ఓవర్లలో ఛేదించి తొలి విజయాన్ని అందుకున్నారు.

ఈ మ్యాచ్‌ తర్వాత పాక్ బ్యాటింగ్ తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా పాక్ అభిమానులు ఓ రేంజ్‌లో ఆడుకున్నారు. పాక్ ఆటతీరుపై ఆ దేశ మాజీ క్రికెటర్లు కూడా ధ్వజమెత్తారు. ప్రపంచకప్‌లో ఆడేది ఇలాగేనా? అంటూ దుమ్మెత్తి పోస్తున్నారు. తాజాగా రావల్పిండి ఎక్స్‌ప్రెస్, మాజీ పేసర్ షోయబ్ అక్తర్ మాట్లాడుతూ.. పాక్ కెప్టెన్ సర్ఫరాజ్‌కు బాగా కొవ్వు పెరిగిపోయిందని అన్నాడు.

టాస్ వేసేందుకు మైదానంలోకి వస్తున్న సమయంలో కొవ్వుతో కూడిన అతడి పొట్ట చాలా అసభ్యంగా కనిపించిందన్నాడు. తాను చూసిన కెప్టెన్లలో ఫిట్‌నెస్ లేని తొలి కెప్టెన్ అతడేనని తూర్పారబట్టాడు. అతడు అటూఇటూ కదల్లేకపోతున్నాడని, కీపింగ్ సమయంలోనూ అతడు చురుగ్గా లేడని విమర్శించాడు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*