ఆర్‌కే మఠ్‌లో కన్నుల పండువగా ఫలహారిణీ కాళీ పూజ

హైదరాబాద్: రామకృష్ణ మఠం పూజా మండపంలో ఫలహారిణీ కాళీ పూజ కన్నుల పండువగా జరిగింది. ఆదివారం సాయంత్రం జరిగిన ఈ పూజలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

1872 జూన్ రెండున రామకృష్ణ పరమహంస తన ధర్మపత్ని శారదా దేవిని రాజరాజేశ్వరిగా పూజించారు. నాటి నుంచి యేటా ఫలహారిణీ కాళీ పూజను రామకృష్ణ మఠం ఘనంగా నిర్వహిస్తోంది.

కార్యక్రమంలో భాగంగా పూజా మండపంలో కొలువుతీరిన రామకృష్ణ పరమహంస, శారదా దేవి, స్వామి వివేకానంద చిత్రపటాలను పువ్వులతో సుందరంగా అలంకరించారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి భజనలు పాడుతూ భక్తులు పారవశ్యంలో మునిగిపోయారు. వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ డైరక్టర్ స్వామి బోధమయానంద మాట్లాడుతూ కార్యక్రమ విశిష్టతను వివరించారు. తొలిసారి ఫలహారిణీ కాళీ పూజకు హాజరైన భక్తుల ఆనందానికి హద్దే లేదు.

నక్షత్ర హారతితో కార్యక్రమం ముగిసింది. అనంతరం భక్తులు భోజన ప్రసాదం స్వీకరించారు.

This post is also available in : English

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*