కేబినెట్ విస్తరణకు ముందు విశాఖ శారద పీఠాన్ని సందర్శించిన ఏపీ సీఎం జగన్

వైజాగ్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి విశాఖ శారద పీఠాన్ని సందర్శించారు. సంప్రదాయ వస్తుల్లో వచ్చిన జగన్ విశాఖ శారద పీఠాధిపతి స్వామీ స్వరూపానందేంద్ర ఆశీస్సులు తీసుకున్నారు. స్వరూపానందేంద్ర జగన్‌కు తిలకం పెట్టి ఆశీర్వదించారు. అనంతరం జగన్‌ రాజ శ్యామలాదేవి ఆలయంలో పూజలు చేశారు. ముఖ్యమంత్రి అయ్యాక జగన్ తొలిసారి రావడంతో పీఠంలో ఉత్సాహ వాతావరణం నెలకొంది.

ఇటీవలి ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసిన జగన్ త్వరలో మంత్రి వర్గ విస్తరణ చేపట్టనున్నారు. ఈ తరుణంలో స్వామి ఆశీస్సులు తీసుకునేందుకు జగన్ వచ్చినట్లు పీఠం వర్గాలు తెలిపాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*