వరల్డ్ కప్ తొలి మ్యాచ్‌లో సౌతాఫ్రికాను చిత్తు చేసిన భారత్

సౌతాంప్టన్: ఐసీసీ ప్రపంచకప్‌ పోటీల్లో భాగంగా సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దక్షిణాఫ్రికా నిర్దేశించిన 228 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 47.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది.

భారత బ్యాట్స్‌మెన్‌లో రోహిత్ శర్మ 122 పరుగులు చేశాడు. వన్డేల్లో రోహిత్‌కిది 23వ సెంచరీ. మిగతా బ్యాట్స్‌మెన్‌లో ధావన్ 8, విరాట్ కోహ్లీ 18, లోకేశ్ రాహుల్ 26, ధోనీ 34, పాండ్యా 15 పరుగులు చేశారు.

తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 227 పరుగులు చేసింది.

భారత బౌలర్లలో చాహల్ 4, బుమ్రా, భువీ చెరి రెండు వికెట్లు తీశారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*