టిక్ టాక్ స్టార్‌ను కలిసేందుకు ఇల్లు వదిలిన బాలిక.. లేఖ రాసి కన్నీళ్లు పెట్టించిన చిన్నారి

ఈ మాటను పెద్దలు ఊరికనే చెప్పలేదని ఈ వార్త చదివితే అర్థం అవుతుంది. చైనీస్ వీడియో షేరింగ్ యాప్ టిక్‌టాక్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పలు వివాదాలకు కారణమై, పలువురి సంసారాల్లో నిప్పులు పోసిన ఈ యాప్‌ భారత్‌లో కొంతకాలం పాటు నిషేధాన్ని కూడా ఎదుర్కొంది. కోర్టు తీర్పు పుణ్యమా అని మళ్లీ ప్లే స్టోర్‌లో దర్శనమిచ్చి జనాలను బానిసలుగా మార్చేస్తోంది.

కత్తికి రెండువైపులా పదును ఉన్నట్టు ఈ యాప్‌లోనూ మంచీచెడూ రెండూ ఉన్నాయి. చాలామందిలోని టాలెంట్‌ను ఈ యాప్ బయటకు తీసి మంచి అవకాశాలు అందిస్తోంది. అదే సమయంలో టిక్‌టాక్‌కు బానిసలుగా మారి పచ్చని సంసారాల్లో నిప్పులు పోసుకుంటున్నవారూ ఉన్నారు.

తాజాగా, తమిళనాడులో జరిగిన ఓ ఘటన ఇందుకు నిలువెత్తు నిదర్శనం. భర్తను, కుటుంబాన్ని కూడా మర్చిపోయి టిక్ ‌టాక్‌కు బానిసగా మారిపోయిన ఓ భార్య అదే లోకంగా జీవిస్తుండడంతో భరించలేని భర్త ఆమెను చంపేశాడు.

తాజాగా ముంబైకి చెందిన 14 ఏళ్ల బాలిక కూడా టిక్‌టాక్ బారిన పడింది. నేపాల్‌లో ఉండే తన అభిమాన టిక్ టాక్ స్టార్‌ని కలిసేందుకు ఏకంగా ఇల్లొదిలి వెళ్లిపోయింది. వెళ్తూవెళ్తూ తనకోసం వెతకొద్దంటూ తల్లిదండ్రులకు ఓ లేఖ కూడా రాసింది. తానేమీ లవర్‌తో వెళ్లిపోవడం లేదని, తనకెవరూ బాయ్‌ఫ్రెండ్స్ లేరని పేర్కొంది.

తన గురించి బాధపడవద్దని, తన అభిమాన టిక్ టాక్ స్టార్‌ని కలిసేందుకు వెళ్తున్నానని చెప్పుకొచ్చింది. తండ్రి ప్రవర్తన బాగోలేదని ఆవేదన వ్యక్తం చేసింది. తాను లేనన్న బాధతో ఆత్మహత్యల్లాంటి అఘాయిత్యానికి పాల్పడ వద్దని, ఈ విషయంలో భగవంతుడి మీద ప్రమాణం చేసి తనకు మాటివ్వాలని కూడా అడిగింది.

కుమార్తె లేఖ చూసిన తల్లిదండ్రులు లబోదిబోమంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు 8 గంటల్లోనే బాలికను వెతికిపట్టుకోవడంతో కథ సుఖాంతమైంది. అయితే, పోలీసుల వెర్షన్ మరోలా ఉంది.

అబ్బాయిలతో మాట్లాడితే తన తండ్రి అంతెత్తున లేస్తుండడం, ఈ విషయంలో తనపై పెద్దగా అరుస్తుండడంతోనే బాలిక ఈ పని చేసిందని పోలీసులు చెప్పారు. తండ్రిపై కోపంతో నేపాల్‌లో ఉన్న 16 ఏళ్ల టిక్ టాక్ స్టార్‌ను కలిసేందుకు ఇంటి నుంచి వెళ్లిపోయిందని పోలీసులు చెప్పారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*