ప్రత్యర్ధుల దాడుల్లో గాయపడిన బీజేపీ కార్యకర్తలకు లక్ష్మణ్ పరామర్శ

దేవరకద్ర: మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం డోకూర్ గ్రామంలో బీజేపీ కార్యకర్త ప్రేమ్ కుమార్ దారుణ హత్యకు గురైన నేపథ్యంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. అన్ని ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. పశ్చిమ బెంగాల్ తరహాలో తెలంగాణాలో కూడా హత్యలు జరుగుతున్నాయని, దీన్ని సహించబోమని ఆయన చెప్పారు. అధికార టీఆర్ఎస్ భారీ మూల్యం చెల్లించక తప్పదని లక్ష్మణ్ హెచ్చరించారు. శాంతియుతంగా ఉండే మహబూబ్ నగర్ జిల్లాలో హింసకు పాల్పడితే చూస్తూ ఉరుకోబోమన్నారు.

అటు నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం మహాదేవునిపేటలో టీఆర్ఎస్ కార్యకర్తల దాడిలో గాయపడిన బీజేపీ మహిళా కార్యకర్త వరలక్ష్మిని కూడా లక్ష్మణ్ పరామర్శించారు. స్థానిక ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న వరలక్ష్మిని ఓదార్చారు. పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందని లక్ష్మణ్ స్పష్టం చేశారు.

ఇటీవలి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధులు గెలవడాన్ని జీర్ణించుకోలేకనే ప్రత్యర్ధి పార్టీలు దాడులకు పాల్పడుతున్నాయని కమలనాథులు ఆరోపిస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*