‏విండీస్‌పై నెగ్గిన ఆస్ట్రేలియా

నాటింగ్‌హామ్: ప్రపంచకప్‌ పోటీల్లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో ఆసీస్ వెస్టిండీస్‌పై 15 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 289 పరుగుల టార్గెట్‌ను చేధించే క్రమంలో వెస్టిండీస్ తడబడింది. చివరకు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 273 పరుగులు మాత్రమే చేసింది. కెప్టెన్ హోప్ 68, నికోలస్ పురన్ 40, హోల్డర్ 51 పరుగులు చేశారు. ఆసీస్ బౌలింగ్‎లో మిచెల్ స్టార్క్ ఐదు వికెట్లు తీశాడు.

ఆస్ట్రేలియా ఆటగాళ్లలో నాథన్ కల్టర్ నైల్ 92, స్టీవెన్ స్మిత్ 73, అలెక్స్ కేరీ 45 పరుగులు చేశారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*