జనసేనాని సంచలన నిర్ణయం

అమరావతి: జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. పార్టీ తరపున పత్రిక పెడుతున్నట్లు వెల్లడించారు. పార్టీ భావజాలం, ప్రణాళికలు, పార్టీ నిర్ణయాలు ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియచేసేందుకే పత్రిక ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. మేధావులు తమ అభిప్రాయాలను వెల్లడించడానికి ఈ పత్రిక వేదిక కావాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి ఈ పత్రిక తోడ్పాటు అందించాలని పవన్ ఆకాంక్షించారు. పత్రిక స్వరూప స్వభావాలు ఎలా ఉండాలనే అంశాలను నిర్ణయించడానికి కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు పవన్ ప్రకటించారు.

ఇటీవల జరిగిన ఎన్నికల్లో జనసేన దారుణమైన ఓటమిని చవి చూసింది. 175 అసెంబ్లీ స్థానాలకు గానూ జనసేన స్థానాన్ని మాత్రమే గెలుచుకుంది. స్వయంగా పవన్ భీమవరం, గాజువాక నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఓటమిపై పార్టీ నేతలతో సమీక్షా సమావేశం నిర్వహించిన పవన్ పత్రిక పెట్టాలనే నిర్ణయం తీసుకున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*