మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఏపీ కార్యక్రమాల నిర్వహణ కమిటీ చైర్మెన్‌గా వీరబాబు

అమరావతి: మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాల నిర్వహణ కమిటీ చైర్మెన్‌గా జర్నలిస్ట్ బాసింశెట్టి వీరబాబు నియమితులయ్యారు. తెనాలిలోని మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కార్యాలయంలో మీడియాతో ముచ్చటించిన అసోసియేషన్ వ్యవస్థాపకుడు, సినిమా దర్శకుడు దిలీప్ రాజా ఈ విషయాన్ని వెల్లడించారు. ఇకపై మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాలన్నింటికీ వీరబాబు నేతృత్వం వహిస్తారని చెప్పారు. తమ సమావేశంలో దీనికి సంబంధించి తీర్మానం కూడా చేశామని దిలీప్ రాజా వివరించారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*