సొంతూరులో లక్ష్మీస్ ఎన్టీఆర్ హీరో శ్రీ తేజ్ సందడి

విజయవాడ: రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందిన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ఆంధ్రప్రదేశ్‌లో విడుదలై ప్రకంపనలు సృష్టిస్తోంది. కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. అటు పుట్టిన ఊరు విజయవాడలో తాను హీరోగా నటించిన సినిమా లక్ష్మీస్ ఎన్టీఆర్ చూడటం ఎంతో ఆనందాన్నిచ్చిందంటున్నారు శ్రీ తేజ్. సోషల్ మీడియా వేదికగా తన సంతోషాన్ని ఫ్యాన్స్‌తో పంచుకున్నారు. విజయవాడ గాంధీనగర్ జయరామ్ థియేటర్‌లో శ్రీ తేజ్ ఈ సినిమా చూశారు. ఫ్యాన్స్‌తో కలిసి సందడి చేశారు.

 

ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీ పార్వతి ప్రవేశించినప్పటినుంచీ జరిగిన ఘటనల ఆధారంగా వర్మ ఈ సినిమాను రూపొందించారు.

ఈ సినిమాలో శ్రీ తేజ్ చంద్రబాబు పాత్రలో నటించారు. శ్రీ తేజ్ నటనకు విమర్శకుల నుంచి కూడా ప్రశంసలందాయి.

శ్రీ తేజ్ గతంలో నటించిన కథానాయకుడు, వంగవీటి సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. వరుస ఆఫర్లతో ప్రస్తుతం శ్రీ తేజ్ బిజీ బిజీ అయిపోయారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*