పోలీసులనే బెదిరించిన రవిప్రకాశ్.. నేడు అరెస్ట్?

హైదరాబాద్: పలు ఆరోపణలతో పోలీసుల విచారణను ఎదుర్కొంటున్న టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్‌ను నేడు అరెస్ట్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. మూడు రోజులపాటు సీసీఎస్ పోలీసుల విచారణను ఎదుర్కొన్న రవిప్రకాశ్.. శుక్రవారం బంజారాహిల్స్ పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యారు. నేడు మరోమారు హాజరు కానున్నారు.
కాగా,

కాగా, విచారణలో పొంతనలేని సమాధానాలు చెబుతూ పోలీసులకు పోలీసులను ముప్పుతిప్పలు పెడుతున్న రవిప్రకాశ్‌ ఓ సందర్భంలో పోలీసులనే బెదిరించినట్టు తెలుస్తోంది. గురువారం సైబరాబాద్ పోలీసుల విచారణ సందర్భంగా .. తనను ఇబ్బంది పెట్టొద్దని, ఏదో ఒక రోజు మీకూ టైం వస్తుందంటూ పోలీసులను బెదిరించినట్టు సమాచారం.

ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించడంతోపాటు కేసు విచారణను వేగవంతం చేసిన పోలీసులు అరెస్ట్ దిశగా అడుగులు వేస్తున్నారు. ఇందుకోసం న్యాయనిపుణుల సలహా కూడా తీసుకున్నట్టు సమాచారం. అరెస్ట్‌పై నేడు నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. రవిప్రకాశ్ అరెస్ట్‌పై సీపీ సజ్జనార్‌తోనూ పోలీసులు చర్చించినట్టు తెలుస్తోంది. మరోవైపు, పోలీసులపై రవిప్రకాశ్ పదేపదే ఆరోపణలు చేస్తూ దర్యాప్తు అధికారులను ప్రభావితం చేసేలా మాట్లాడుతుండడంతో సైబరాబాద్ కమిషనరేట్‌లోని మీడియా పాయింట్‌ను పోలీసులు ఎత్తివేశారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*