ఏపీకి గవర్నర్ అంటూ వచ్చిన వార్తలపై స్పందించిన సుష్మా

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా నియమితులైనట్లు వచ్చిన వార్తలపై మాజీ కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ స్పందించారు. ఈ వార్త ఫేక్ అని తేల్చారు. తొలుత కేంద్ర మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ సుష్మా స్వరాజ్‌కు అభినందనలు చెబుతూ ట్వీట్ చేయడంతో ఆమె ఏపీకి గవర్నర్‌గా నియమితులయ్యారని నెటిజన్లు భావించారు. ఇంతలోనే ఇది అబద్ధమని తెలుసుకున్న మంత్రి తన ట్వీట్‌ను డిలీట్ చేశారు. ఆ తర్వాత కాసేపటికే స్పందించిన సుష్మా స్వరాజ్ తాను ఏపీకి గవర్నర్‌గా నియమితులైనట్లు వచ్చిన వార్తలు అబద్ధమని తేల్చారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*