వైసీపీకి డిప్యూటీ స్పీకర్ వార్తలు అవాస్తవం: జగన్

న్యూఢిల్లీ: ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరం ఎంతో ఉందని, దేవుడి దయతో అది వచ్చే వరకు కేంద్రాన్ని అడుగుతూనే ఉంటానని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. శుక్రవారం రాత్రి ఆయన ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యారు.

అనంతరం జగన్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రం చాలా ఇబ్బందుల్లో ఉందని, కాబట్టి కేంద్ర సహాయ సహకారాలు అవసరమని షాతో చెప్పినట్టు తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా ఎంత అవసరమో వివరిస్తూ హోంత్రికి ఓ లేఖను అందించినట్టు చెప్పారు.

నేడు జరగనున్న నీతి ఆయోగ్ సమావేశంలోనూ ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై మాట్లాడతానన్నారు. పెండింగ్‌లో ఉన్న విభజన హామీలను త్వరగా పరిష్కరించేలా చూడాలని అమిత్ షాను కోరినట్టు జగన్ వివరించారు. వైసీపీకి కేంద్రం డిప్యూటీ స్పీకర్ పదవిని ఆఫర్ చేసినట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని, అలాంటి అసత్య వార్తల ప్రచారాన్ని మానుకోవాలని జగన్ హితవు పలికారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*