టీడీపీ వ్యూహకర్తగా ప్రశాంత్ కిశోర్?

విజయవాడ: ఒకప్పుడు ఎన్నికలంటే అది పూర్తిగా రాజకీయ నాయకులకు సంబంధించిన వ్యవహారంలాగే ఉండేది. సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఆ పరిస్థితిలో మార్పు వచ్చింది. ప్రతి పార్టీ కూడా ప్రజల్ని ఆకట్టుకునేందుకు సరికొత్త వ్యూహాలను అమలుచేయక తప్పడంలేదు. ఈ

ఈ నేపథ్యంలో ప్రశాంత్ కిశోర్ వంటి కొత్తతరం వ్యూహకర్తలకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఇటీవల ఏపీ ఎన్నికల్లో వైసీపీ గెలిచాక ప్రశాంత్ కిశోర్ పేరు మరికాస్త ఎక్కువగా వినిపిస్తోంది. ఇప్పటికే ఆయనతో పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ అధినాయకత్వం ఒప్పందం కుదుర్చుకోగా, తమిళనాడు అధికార పక్షం అన్నాడీఎంకే కూడా ఆసక్తి ప్రదర్శిస్తోంది.

ప్రశాంత్ కిశోర్ కు చెందిన ఐ-పాక్ సంస్థ డైరక్టర్లను డైరెక్టర్లను తమిళనాడు సీఎం పళనిస్వామి ఆహ్వానించడం అందుకు నిదర్శనం. ఈ సాయంత్రం ఐ-పాక్ డైరక్టర్లు డైరెక్టర్లు వినేశ్, రిషిరాజ్ లు సీఎం పళనిస్వామితో చెన్నైలో భేటీ కానున్నారు. 2021 ఎన్నికలే లక్ష్యంగా అన్నాడీఎంకే ప్రశాంత్ కిశోర్ సేవలు పొందాలని భావిస్తున్నట్టు తాజా పరిణామాలు చెబుతున్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*