బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టింది వీరే

హైదరాబాద్: తెలుగు బిగ్‌బాస్ షో-3 ప్రారంభమైంది. హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో వంద రోజుల పాటు సాగే ఈ షోలో పార్టిసిపేట్ అయ్యేందుకు వచ్చిన 15 మంది సెలబ్రిటీలను హోస్ట్ నాగ్ పరిచయం చేశారు.

 

తొలి కంటెస్టెంట్ సావిత్రి

 

బిగ్‌బాస్ హౌస్‌లోకి తొలి కంటెస్టెంట్‌గా తీన్మార్ వార్తల సావిత్రి అడుగుపెట్టారు.

రెండో కంటెస్టెంట్‌గా సీరియల్ యాక్టర్ రవికృష్ణ అడుగుపెట్టాడు. రవికృష్ణ ‘మొగలిరేకులు’ వరూధినీ పరిణయం వంటి పలు టీవీ సీరియల్స్‌లో నటించారు.

మూడో కంటెస్టెంట్‌గా జూనియర్ సమంత అశురెడ్డి అడుగుపెట్టారు.

నాలుగో కంటెస్టెంట్‌గా టీవీ9 న్యూస్ యాంకర్ జాఫర్ అడుగుపెట్టారు.

ఐదో కంటెస్టెంట్‌గా మలిరెడ్డి హిమజా రెడ్డి అడుగుపెట్టారు. ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాకు చెందిన హిమజ పలు సీరియల్స్‌తో పాటు సినిమాల్లో కూడా నటించారు.

ఆరో కంటెస్టెంట్‌గా తెలంగాణ జానపద గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ అడుగుపెట్టారు.

ఏడో కంటెస్టెంట్‌గా తెలుగు సీరియల్స్‌లో కామెడీ పాత్రలు పోషించే రోహిణి అడుగుపెట్టారు.

ఎనిమిదవ కంటెస్టెంట్‌గా పాపులర్ కొరియోగ్రాఫర్ బాబా భాస్కర్ అడుగుపెట్టారు.

తొమ్మిదవ కంటెస్టెంట్‌గా తెలుగు సినిమా నటి పునర్వి భూపాలం అడుగుపెట్టారు. ఉయ్యాల జంపాల సినిమాలో ఆమె నటించారు.

పదవ కంటెస్టెంట్‌గా నటి హేమ అడుగుపెట్టారు.

11వ కంటెస్టెంట్‌గా తెలుగు సీరియల్ నటుడు అలీ రెజా అడుగుపెట్టాడు.

12వ కంటెస్టెంట్‌గా యూ ట్యూబ్ హాస్య నటుడు మహేశ్ విట్టా అడుగుపెట్టాడు.

13వ కంటెస్టెంట్‌గా పటాస్ యాంకర్ శ్రీముఖి అడుగుపెట్టారు.

14, 15వ కంటెస్టెంట్లుగా రియల్ లైఫ్ కపుల్స్ హీరో వరుణ్ సందేశ్, ఆయన భార్య వితిక శేరూ అడుగుపెట్టారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*