విండీస్ టూర్‌కు వెళ్లే కోహ్లీ సేన ఇదే!

ముంబై: ఆగస్ట్‌లో జరగనున్న వెస్టిండీస్‌ టూర్‌కు భారత క్రికెట్ జట్లను ప్రకటించారు. ఎమ్మెస్కే ప్రసాద్‌ నేతృత్వంలో జరిగిన బీసీసీఐ సెలక్షన్‌ కమిటీ ఈ జట్లను ప్రకటించింది. ఆగస్టు 3వ తేదీ నుంచి భారత్ మూడు టీ20లు, మూడు వన్డేలతో పాటు రెండు టెస్టులు ఆడనుంది. మూడు ఫార్మాట్లకు కోహ్లీయే కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. ధోనీ స్థానంలో రిషబ్ పంత్‌ను తీసుకున్నారు. గాయం కారణంగా ప్రపంచ కప్ నుంచి వైదొలిగిన శిఖర్ ధావన్‌ను తిరిగి ఎంపిక చేశారు.

కోహ్లీ సేన ఇదే:

వన్డే టీమ్: విరాట్‌ కోహ్లీ(కెప్టెన్‌), రోహిత్‌ శర్మ(వైస్‌ కెప్టెన్‌), శిఖర్‌ ధావన్‌, కేఎల్‌ రాహుల్‌, శ్రేయస్‌ అయ్యర్‌, మనీశ్‌ పాండే, రిషభ్‌ పంత్ ‌(వికెట్‌ కీపర్‌), రవీంద్ర జడేజా, కుల్‌దీప్‌ యాదవ్‌, యుజువేంద్ర చాహల్‌, కేదార్‌ జాదవ్‌, మహ్మద్‌ షమి, భువనేశ్వర్‌ కుమార్‌, నవదీప్‌ సైనీ, ఖలీల్‌ అహ్మద్‌.

టెస్ట్ టీమ్: విరాట్‌ కోహ్లీ (కెప్టెన్‌), అజింక్యా రహానే (వైస్‌ కెప్టెన్‌), రోహిత్‌ శర్మ, రిషభ్‌ పంత్ ‌(వికెట్‌ కీపర్‌), మయాంక్‌ అగర్వాల్‌, కేఎల్‌ రాహుల్‌, ఛటేశ్వర్‌ పుజారా, హనుమ విహారి, వృద్ధిమాన్‌ సాహా(వికెట్‌ కీపర్‌), రవిచంద్రన్‌ అశ్విన్‌, రవీంద్ర జడేజా, కుల్‌దీప్‌ యాదవ్‌, ఇషాంత్‌ శర్మ, మహ్మద్‌ షమి, ఉమేశ్‌ యాదవ్‌, జస్ప్రిత్‌ బుమ్రా.

టీ20 టీమ్: విరాట్‌ కోహ్లీ (కెప్టెన్‌), రోహిత్‌ శర్మ(వైస్‌ కెప్టెన్‌), శిఖర్‌ ధావన్‌, కేఎల్‌ రాహుల్‌, శ్రేయస్‌ అయ్యర్‌, మనీశ్‌ పాండే, రిషభ్ పంత్ ‌(వికెట్‌ కీపర్‌), కృనాల్‌ పాండ్య, రవీంద్ర జడేజా, భువనేశ్వర్‌ కుమార్‌, ఖలీల్‌అహ్మద్‌, దీపక్‌ చాహర్‌, నవదీప్‌ సైనీ, వాషింగ్టన్‌ సుందర్‌, రాహుల్‌ చాహర్.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*