విశ్వాస పరీక్షలో ఓడిపోయిన కుమారస్వామి.. రాజీనామా

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీలో జరిగిన విశ్వాస పరీక్షలో 99-105 తేడాతో కాంగ్రెస్-జేడీఎస్ సర్కారు పరాజయం పాలైంది. సభకు 205 మంది సభ్యులు హాజరుకాగా బీజేపీకి 105 మంది ఎమ్మెల్యేల మద్దతు లభించింది. కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణానికి అనుకూలంగా 99 ఓట్లు మాత్రమే వచ్చాయి. బీఎస్పీ అభ్యర్ధి గైర్హాజరయ్యారు. విశ్వాస పరీక్షలో ఓటమి పాలైన మరుక్షణమే ముఖ్యమంత్రి పదవికి కుమారస్వామి రాజీనామా చేశారు. గవర్నర్ వాజుభాయ్ వాలాను కలిసి రాజీనామా సమర్పించారు. రాజీనామాను గవర్నర్ ఆమోదించారు.

2018, మే 23న ప్రారంభమైన కుమారస్వామి పాలన 14 నెలల పాటు కొనసాగింది. చివరకు మైనార్టీలో పడిపోయి విశ్వాస పరీక్షలో ఓడిపోయింది. నూతన ప్రభుత్వం ఏర్పడే వరకూ కుమారస్వామిని ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని కోరారు. మరోవైపు ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు బీజేపీ యత్నాలు ముమ్మరం చేసింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*