మోదీకి లేఖ రాసిన సెలబ్రిటీలపై అనంత శ్రీరామ్ ఫైర్

హైదరాబాద్: ‘‘జై శ్రీరామ్‌ అనేది ఓ రెచ్చగొట్టే యుద్ధ నినాదంలా మారిందంటూ వివిధ రంగాలకు చెందిన 49 మంది సెలబ్రిటీలు ప్రధాని మోదీకి లేఖ రాయడాన్ని సినిమా పాటల రచయిత అనంత శ్రీరాం తప్పుబట్టారు. జై శ్రీరామ్‌ పేరిట అరాచకాలు పెచ్చరిల్లినా ప్రధాని చర్యలు తీసుకోవడం లేదనడాన్ని కూడా అనంత శ్రీరామ్ వ్యతిరేకించారు. క్రిష్ణా రామా అని అనడమే తప్పన్నట్లుగా ప్రముఖలు వ్యవహరిస్తున్నారంటూ అనంత్ శ్రీరామ్ ఫేస్‌బుక్‌లో ఓ పోస్ట్ పెట్టారు.

 

 

“నకిలీ మేథావులు మళ్ళీ సకిలించారు”

 

కుహనా లౌకికవాదులంతా కుమ్మక్కై

 

ప్రధాన మంత్రికి ఉత్తరం రాశారట అందులో

 

ఏముందయ్యా అంటే “జై శ్రీరాం” అన్న

 

పదం వల్ల

 

ఎన్నో దారుణ మారణ కాండలు

 

జరిగిపోతున్నాయంట అందువల్ల ఆ పదం

 

వల్ల జరిగే దుష్పరిణామాలు ఆపాల్సిన

 

బాధ్యత ప్రధానమంత్రిదేనట . అంటే ఆ

 

మహాశయులు ఇప్పుడేమంటారు “జై” అన్న

 

పదాన్ని , “శ్రీరాం” అన్న పదాన్ని

 

నిఘంటువుల్లోనించి నిషేధించమంటారా?

 

ఏమో అన్నా అంటారు

మేథావులుకదా

 

వాళ్ళు అనేవారలు, మేము వినే వారలము

 

ఉరుమురిమి ఎక్కడో పడ్డట్టు చిక్కంతా వచ్చి

 

ఇప్పుడు క్రిష్ణా రామా అనుకుంటూ

 

శేష జీవితం ఆనందంగా గడుపుతున్న

 

తల్లిదండ్రులని వచ్చి చుట్టుకుంటుంది.

 

ఎందుకంటే నాపేరు “అనంత శ్రీరాం”

 

ఈ మేథావుల మేధస్సుని

 

అంచనా వెయ్యలేక

 

మాతల్లిదండ్రుల్లానే ఎంతోమంది

 

తమపిల్లల పేర్లలో రామశబ్ధాన్ని

 

ప్రయోగించారు

 

. (సీతారాం ఏచూరి గారి నాన్నగారితో సహా ).

 

ఇప్పుడు వాళ్ళంతా మా జనన ధృవీకరణ

 

పత్రాలు మొదలుకుని ఆధార్ల వరకూ

 

మాపేర్లు మార్చే బృహత్తర బాధ్యతని

 

నెత్తినేసుకోవడం ఎలారా నాయనా అని

 

నెత్తీ , నోరు బాదుకోవలసిన పరిస్థితి

 

“అది మరి మేధావి దెబ్బంటే”

మోదీకి లేఖ రాసిన సెలబ్రిటీల్లో మణిరత్నం, శ్యామ్‌ బెనగల్‌, అనురాగ్ కశ్యప్, అపర్ణా సేన్‌ తదితరులున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*