చంద్రయాన్-2 విజయం వెనక స్వామీ వివేకానంద భక్తుడు

చదువు కోసం చదువు చెప్పారు
పేద విద్యార్ధులకు పాఠాలు నేర్పారు
స్వామీ వివేకానందను అనుసరిస్తారు
చంద్రయాన్-2 విజయంలో కీలక పాత్ర

హైదరాబాద్: చంద్రయాన్-2 విజయం వెనక చంద్రకాంత్ అనే చంద్రకాంత్ అనే శాస్త్రవేత్త ఉన్నారు. ఆయన ఈ ప్రాజెక్టుకు డిప్యూటీ డైరెక్టర్‌గా పని చేశారు. రేడియో ఫ్రీక్వెన్సీ సిస్టమ్‌కు ఆయన బాధ్యత వహించారు. లునార్‌క్రాఫ్ట్‌కు, ఎర్త్ స్టేషన్‌కు మధ్య కమ్యునికేషన్ వ్యవహారాన్ని ఈయనే పర్యవేక్షిస్తున్నారు. 2001లో ఇస్రోలో చేరిన ఈయనకు ప్రస్తుతం ఆయనకు 42 సంవత్సరాలు.

ఆయన పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీలో ఉన్న గురుప్ అనే గ్రామంలో ఒక సామాన్య రైతు కుటుంబంలో జన్మించారు. తండ్రి పేరు మధుసూధన్, తల్లి పేరు అసిమ. చిన్నతనంలో చదువుకు కావాల్సిన డబ్బుల కోసం గ్రామీణ పేద విద్యార్ధులకు చదువు చెప్పేవారు. ఐదో తరగతి వరకు స్థానికంగా ఉన్న పాఠశాలలో చదువుకున్నారు. సెకండరీ ఎడ్యుకేషన్ వరకు మరో స్కూల్‌లో చదువుకున్నారు.

చిన్నతనం నుంచి స్వామీ వివేకానందను అనుసరిస్తూ ఉండేవారు. రామకృష్ణ మిషన్ విద్యామందిర్‌లో ఫిజిక్స్‌ డిగ్రీ చదువుకున్నారు. ఆ తర్వాత ఎమ్మెస్సీ, ఎంటెక్ పూర్తి చేశారు. ఒకటో తరగతి నుంచే చదువులో బాగా చురుకుగా ఉండేవారని ఆయన టీచర్ అంటున్నారు. కొన్ని కారణాల వల్ల జులై 15న చంద్రయాన్-2 ప్రయోగం ఆగిందని తెలిసినప్పుడు చంద్రకాంత్ తల్లిదండ్రులు కలత చెందారు. మళ్లీ జులై 22న విజయవంతం అయినప్పుడు ఇరుగుపొరుగు వారిని కౌగిలించుకుని ఆనందించారు.

(విజయ్)

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*