సుష్మా స్వరాజ్ ఇక లేరు

న్యూ ఢిల్లీ: సీనియర్ బీజేపీ లీడర్, మాజీ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఇకలేరు. 67 సంవత్సరాల వయస్సులో ఆమె కన్ను మూసారు. ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్‌లో గుండె పోటుతో కన్ను మూశారు.

ఆమెకు గుండెపోటు వచ్చి కన్ను మూసారు. ఆమెను రాత్రి పది గంటల పదిహేను నిమిషాల సమయంలో హుటాహుటిన ఆస్పత్రిలో చేర్చారు. ఆమెతో పాటు ఆమె కుటుంబ సభ్యులు, పలువురు సీనియర్ బీజేపీ నాయకులు ఉన్నారు.

ఈ వార్త విన్న తర్వాత బీజేపీ నాయకులతో పాటు పలువురు జాతీయ స్థాయి నాయకులు, రాష్ట్ర స్థాయి నాయకులు సంతాపం తెలియజేస్తున్నారు. ప్రధాని మోడీ ట్విట్టర్‌లో సుష్మా స్వరాజ్‌కు సంతాపంగా పలు ట్వీట్లు చేశారు. భారత దేశ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయానికి తెర పడిందని ఆయన అభివర్ణించారు.

సుష్మా స్వరాజ్ 1953, ఫిబ్రవరి 14న హర్యానాలో జన్మించారు. 1973లో ఆమె సుప్రీం కోర్టులో లాయర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించారు.

This post is also available in : English

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*