కశ్మీర్‌పై కేంద్రం నిర్ణయానికి కీలక వ్యక్తి మద్దతు

న్యూఢిల్లీ: విమర్శకుల నోరు మూయించేలా, కేంద్రానికి అండగా ఒక కీలక వ్యక్తి వ్యాఖ్యలు చేశారు. జమ్మూ కశ్మీర్ విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం దేశంలో హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. ఆర్టికల్ 370 రద్దుతో పాటు, జమ్మూకశ్మీర్ రాష్ట్రాన్ని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయానికి మహారాజు హరిసింగ్ తనయుడు కరణ్ సింగ్ మద్దతు తెలిపారు.

జమ్మూకశ్మీర్‌కు మహారాజు హరిసింగ్ చివరి రాజు, మాజీ కేంద్ర మంత్రి, కాంగ్రెస్ నాయకులు. 1947, అక్టోబర్ 26న ఈయన కశ్మీర్‌ను భారత్‌లో కలుపుతూ ఒప్పంద సంతకం చేశారు.

ఆర్టికల్ 370 రద్దు నిర్ణయానికి పార్లమెంటు మద్దతు, భారత దేశ వ్యాప్తంగా ప్రజల మద్దతు, జమ్మూకశ్మీర్ ప్రజలు మద్దతు లభించిందని ఆయన అన్నారు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయని కూడా ఆయన చెప్పారు.

లడఖ్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చడాన్ని కూడా ఆయన సమర్ధించారు. ఆర్టికల్ 35ఏ వల్ల జమ్మూకశ్మీర్ మహిళలు రాష్ట్రేతరులను పెళ్లి చేసుకునే అవకాశం కూడా ఉండేది కాదని తప్పుపట్టారు. కేంద్రం చేసే చట్టాలు ఇక్కడ అమలు కాకపోవడం సరైనది కాదని అభిప్రాయపడ్డారు. అందుకే కేంద్రం నిర్ణయం ఆమోదయోగ్యమని ఆయన చెప్పారు.

This post is also available in : English

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*