కశ్మీర్‌లో తెలుగు సినిమాలు తీయండి: మోడీ

న్యూఢిల్లీ: ఆర్టికల్ 370 రద్దు, జమ్మూకశ్మీర్ విభజన అనంతరం తొలిసారిగా ప్రధాని మోడీ జాతినుద్దేశించి ప్రసంగించారు. కశ్మీరీ ప్రజల ఇబ్బందులు తొలగిపోయాయని, తాము వారికి న్యాయం చేశామని మోడీ అన్నారు. ప్రైవేటు సంస్థలు టెక్సాలజీని కశ్మీర్‌లో కూడా విస్తరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. లడఖ్ ప్రాంతం సోలార్ ఎనర్జీ ఎదుగుదలకు చక్కగా ఉంటుందని తెలిపారు.

 

ఎంతో అందంగా ఉండే కశ్మీర్‌లో సినిమాల చిత్రీకరణ జరగాలని కోరారు. బాలీవుడ్, తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలు షూటింగ్‌లు ఇక్కడ జరగాలని ఆకాంక్షించారు. పర్యాటక రంగంలో కశ్మీర్‌ను అగ్రగామిగా నిలబెట్టాల్సిన బాధ్యత మన అందరిదని అన్నారు. ఆర్టికల్ 370, ఆర్టికల్ 35ఏ దుష్ప్రభావం వల్ల కశ్మీర్ ప్రజలకు కలిగిన ఇబ్బందుల నుంచి త్వరలోనే బయటపడతారని తాను విశ్వసిస్తున్నట్టు ప్రధాని మోడీ చెప్పారు.

This post is also available in : English

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*