పాకిస్థాన్ ఆటలు ఇక సాగవు: మోడీ

న్యూఢిల్లీ: ఆర్టికల్ 370 రద్దు, జమ్మూకశ్మీర్ విభజన అనంతరం తొలిసారిగా ప్రధాని మోడీ జాతినుద్దేశించి ప్రసంగించారు. జమ్మూకశ్మీర్‌లో ఇప్పటివకరకూ కోటిన్నర్ర మంది ప్రజలు ఆర్టికల్ 370 వల్ల మోసపోయారని ఆయన వివరించారు. ఆర్టికల్ 370ను అడ్డం పెట్టుకుని భారత అంర్గత భద్రతకు పాకిస్థాన్ ఇబ్బంది కలిగించిందని చెప్పారు. ఇకపై పాకిస్థాన్ ఆటలు సాగవని ఆయన స్పష్టం చేశారు.

దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఉన్న ఆడ బిడ్డలు పొందుతున్న హక్కులను జమ్మూకశ్మీర్‌లో ఉంటున్న ఆడబిడ్డలు పొందలేకపోయారని అన్నారు. ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీలకు అమలవుతున్న రిజర్వేషన్లు కశ్మీర్‌లో అమలు కావడంలేదు. ఇన్నాళ్లు అక్కడ అవినీతి, కుటుంబ పాలన రాజ్యమేలాయి. వేల మంది మరణించారు. విద్యా హక్కు చట్టం దేశమంతా అమలైనా అక్కడ మాత్రం అమలయ్యేది కాదని మోడీ అన్నారు.

ఇకపై అలా ఉండదు. తాము జమ్మూకశ్మీర్ ప్రజలకు న్యాయం చేశాము. అందరికీ సమాన హక్కులు లభించనున్నాయి. కొత్త చరిత్ర మొదలు అవుతుంది. ఆర్టికల్ 370, 35ఏ చూపించిన దుష్ప్రభావం నుంచి జమ్మూకశ్మీర్ త్వరగానే కోలుకుంటుందని ఆశిస్తున్నా. అక్కడి ప్రజలకు అన్ని ప్రయోజనాలు కల్పిస్తాం. త్వరలో ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తాం. త్వరలోనే కశ్మీర్‌లో ఎన్నికలు నిర్వహిస్తాం, ఈ విషయంలో ఎవరూ కంగారుపడాల్సిన అవసరం లేదని ప్రధాని మోడీ చెప్పారు.

This post is also available in : English

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*