బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీకి అస్వస్థత

న్యూఢిల్లీ: బీజేపీ సీనియర్ నాయకులు, మాజీ కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ(67) అస్వస్థతకు గురయ్యారు. న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లోని కార్డియాలజీ విభాగంలో చేరారు. ఆయన గుండె, ముత్రపిండ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. గత రెండేళ్లుగా ఆయన ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు.

ప్రధాని మోడీ, బీజేపీ అధ్యక్షులు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, లోక్ సభ స్పీకర్ ఓం బిర్ల ఆస్పత్రికి వెళ్లి అరుణ్ జైట్లీ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసారు.

ప్రధాని మోడీ నేతృత్వంలో ఐదేళ్ల పాటు కేంద్ర ఆర్ధిక మంత్రిగా పని చేశారు. అయితే ఆరోగ్య రీత్యా ప్రస్తుతం బాధ్యతలకు దూరంగా ఉంటున్నారు. 2019 ఎన్నికల్లో ఆయన పోటీ చేయలేదు. ఆరోగ్య రీత్యా తనను బాధ్యతల నుంచి దూరంగా ఉంచాలని విన్నవించుకుంటూ ప్రధాని మోడీకి లేఖ రాసారు. గతేడాది ఆయన కిడ్నీ ట్రాన్స్‌ప్లాన్‌టేషన్ చేయించుకున్నారు.

This post is also available in : English

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*