రూ. 12.34 లక్షల హోటల్ బిల్లు కట్టకుండా పారిపోయాడు

హైదరాబాద్: 12.34 లక్షల రూపాయల హోటల్ బిల్లు కట్టకుండా ఒక వ్యాపారవేత్త పారిపోయాడు. హైదరాబాద్‌లోని తాజ్ బంజారా హోటల్‌లో ఈ సంఘటన జరిగింది. దీంతో హోటల్ మేనేజర్ బంజారా హిల్స్ పోలీస్‌లకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కు చెందిన శంకర నారాయణ అనే వ్యక్తి తాజ్ బంజారా హోటల్‌తో తక్కువ రేటుకు మాట్లాడుకుని ఒక ఒప్పందం చేసుకున్నాడు. ఎక్కువ కాలం హోటల్‌లో ఉండేందుకు మాట్లాడుకుని అన్ని వసతులతో కూడిన రూమ్‌లో దిగాడు.

అయితే ఏప్రిల్ 15న అకస్మాత్తుగా ఎవరికీ చెప్పకుండా మాయం అయ్యాడు. మొత్తం బిల్లు రూ. 25.96 లక్షలు అవ్వగా అందులో రూ. 13.62 లక్షలను మాత్రమే శంకర్ చెల్లించాడు. అతను వెళ్లిపోయినప్పటి నుంచి హోటల్ మేనేజ్‌మెంట్ చాలాసార్లు ఫోన్లు చేసింది. అతను తప్పకుండా మిగతా బిల్లు కూడా చెల్లిస్తానని చెబుతూ ఉండేవాడు. కానీ ఇప్పుడు సడెన్‌గా ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తుంది, అని బంజారా హిల్స్ సబ్ ఇన్‌స్పెక్టర్ రవి తెలిపారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

This post is also available in : English

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*