కేరళలో రెడ్ ఎలర్ట్ జరీ చేసిన ఐఎండి

తిరువనంతపురం: కేరళలో ఎనిమిది జిల్లాల్లో ఇండియన్ మెటిరియోలాజికల్ డిపార్ట్‌మెంట్ రెడ్ అలర్ట్‌ను జారీ చేసింది. ప్రస్తుతం కేరళ రాష్ట్రం వరదల్లో చిక్కుకుని విలవిల్లాడుతున్న సంగతి తెలిసిందే. కేరళలోని ఎర్నాకులం, ఇడుక్కి, పాలక్కడ్, మలప్పురం, కాజీకోడ్, కన్నూరు, వాయనాడ్, కసూర్‌గడ్ ప్రాంతాల్లో రెడ్ అలర్ట్‌ను ప్రకటించారు.

మూడు నుంచి నాలుగు మీటర్ల ఎత్తు వరకు అలలు ఎగిసి పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ పరిస్థితి ఆగష్టు 11 అర్ధరాత్రి వరకు ఉండవచ్చు. కేరళ సీఎం కార్యాలయం ఇప్పటికీ 24 గంటల అత్యవసర కంట్రోల్ రూంను ఏర్పాటు చేసింది. 24 రక్షక క్యాంపులు రాష్ట్రంలో వాటి పనిని ప్రారంభించాయి. వీటితో పాటు 8 మంది ఇంజనీరింగ్ టాస్క్‌ ఫోర్స్ టీంలు పలు జిల్లాల్లో చర్యలు చేపట్టాయి. నావీ, ఎయిర్ ఫోర్స్‌తో పాటు రక్షక చర్యల్లో ఆర్మీ కూడా పాలు పంచుకుంటుంది.

This post is also available in : English

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*