కశ్మీర్ భవిష్యత్తును ఇమ్రాన్ ఖాన్ నాశనం చేస్తున్నాడు: షెహ్‌బాజ్ షరీఫ్

ఇస్లమాబాద్: పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ కశ్మీర్ భవిష్యత్తును నాశనం చేస్తున్నాడని పాకిస్థాన్ ప్రతిపక్ష నాయకుడు షెహ్‌బాజ్ షరీఫ్ ఆరోపించారు. ఆయన పాకిస్థాన్ ముస్లిం లీగ్ నవాజ్‌కు అధ్యక్షుడు. పాకిస్థాన్ ప్రముక దిన పత్రిక డాన్ ప్రకారం గతంలో కూడా పలు సందర్భాల్లో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి అనుకూలంగా ఇమ్రాన్ ప్రవర్తించాడని షెమ్‌బాజ్ ఆరోపించారు.

కశ్మీర్ విషయంలో భారత ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రముఖ ప్రతిపక్ష నాయకులు ప్రజల్లో ఐకమత్యాన్ని తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. కానీ నాయకులను అరెస్ట్ చేయడం ద్వారా ఆ ప్రయత్నాలన్నింటినీ ఇమ్రాన్ కాన్ నాశనం చేశారని షెహ్‌బాజ్ చెప్పారు. కశ్మీర్ విషయంలో భారత ప్రభుత్వ నిర్ణయం తర్వాత భారత్‌కు వ్యతిరేకంగా పాకిస్థాన్ పలు నిర్ణయాలు తీసుకుంది. వ్యాపార సంబంధాలను తెంచుకుంది, పాకిస్థాన్ భూభాగం నుంచి భారత్‌కు ఉన్న ట్రైన్, బస్సు సర్వీసులను నిలిపివేసింది, భారత సినిమాలను కూడా బ్యాన్ చేసింది.

This post is also available in : English

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*