కురుక్షేత్రం 3D మూవీ రివ్యూ…

ఇండస్ట్రీలో భారీ బడ్జెట్ తో ఖర్చుపెట్టి మరీ తీసిన చిత్రం ‘కురుక్షేత్రం’. నాగన్న దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో యాక్షన్ కింగ్ అర్జున్, స్టార్ హీరో దర్శన్, నిఖిల్ గౌడ, స్నేహ, రవిచంద్రన్, సోనూసూద్ లాంటి భారీ కాస్టింగ్ తో తెరకెక్కిన ఈసినిమా తెలుగులో డబ్బింగ్ వెర్షన్ గా రిలీజ్ అయ్యింది. మరి ఈ సినిమా ఎలా ఉందో తెలియాలంటే రివ్యూ లోకి వెళ్లవలిసిందే…

 

కథేంటంటే…
మహాభారతం కథ అందరికీ తెలిసిందే. కౌరవులకి-పాండవులకి జరిగిన యుద్ధం కురుక్షేత్రం. ఈ యుద్ధం గురించే సినిమా మొత్తం ఆసక్తికరంగా మలిచారు. అయితే, ఈసినిమాలో ధర్మరాజు పట్టాభిషేకాన్ని దుర్యోధనుడు తిరస్కరిస్తాడు. ఇక్కడ్నుంచి కథ స్టార్ట్ అవుతుంది. అక్కడ కర్ణుడు, దుర్యోధనుడు స్నేహితులుగా మారడం, శకుని పన్నిన పన్నాగంలో పాండవులు చిక్కుకుని అడవుల పాలు అవ్వడం, ఆ తర్వాత కౌరవులపై పాండవులు పగతీర్చుకోవడం ఇందులో శ్రీకృష్ణుడి మాయ ఇలా భారతదేశపు మహాభారత కావ్యాన్ని మరోసారి వెండితెరపై ఆవిష్కృతం చేసారు.

 

సమీక్ష
3డి ఎఫెక్ట్స్ ఈ సినిమాకి ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. ద్రౌపతిగా స్నేహ, అర్జునిడిగా సోనూసూద్ కర్ణుడిగా అర్జున్ చాలా బాగా నటించారు. ఆయా పాత్రలకి వారు జీవం పోశారనే చెప్పాలి. ఇక దుర్యోదనుడు పాత్రలో దర్శన్ యాక్టింగ్ సినిమాకి హైలెట్. మయసభలో వచ్చే సాంగ్ సూపర్ గా ఉంటుంది. ఇంకా అభిమన్యుడిని చంపే సీన్, కుంతీదేవి కర్ణుడి సీన్, సినిమాకి హైలెట్స్ గా నిలిచాయి. ముఖ్యంగా నిఖిల్ గౌడా సీన్స్ కి థియేటర్స్ లో క్లాప్స్ పడతాయి. ఇలా తెలిసిన భారతాన్ని అయినా సరే ఒక దృశ్యకావ్యం చూస్తున్నట్లుగా తీసాడు డైరెక్టర్ నాగన్న. మేకింగ్, ప్రొడక్షన్ వ్యాల్యూస్, ఆర్ ఆర్, లొకేషన్స్, ఫోటోగ్రఫీ సినిమాకి హైలెట్. 3డి లో చూడటం గొప్ప అనుభూతి ఇస్తుంది.

చివరగా…
ఎన్టీఆర్ చేసిన దానవీర శూరకర్ణ సినిమా స్క్రీన్ ప్లేని తలపిస్తుంది. చాలామంది కన్నడ ఆర్టిస్టులే ఉన్నా… కూడా తెలుగు ప్రేక్షకులకి డబ్బింగ్ సినిమా అనిపించదు. ఓవర్ ఆల్ గా చెప్పాలంటే… నేటి జెనరేషన్ తప్పకుండా చూడాల్సిన సినిమా….
రేటింగ్: 3.5/5

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*