బీజేపీలోకి మోత్కుపల్లి నరసింహులు!

హైదరాబాద్: సీనియర్ నాయకులు, మాజీ టీడీపీ నేత మోత్కుపల్లి నరసింహులు బీజేపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఆయన ఇప్పటికే పలుసార్లు తెలంగాణ ప్రముఖ బీజేపీ నాయకులు, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావును కలిశారు. ఈ క్రమంలోనే బీజేపీలో చేరేందుకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలుస్తోంది. త్వరలోనే బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, వర్కింగ్ ప్రెసిడెంట్ జెపి నడ్డా సమక్షంలో బీజేపీలో చేరనున్నారు.

మోత్కుపల్లి నరసింహులు టీడీపీ పార్టీ స్థాపించబడిన నాటి నుంచీ టీడీపీలోనే ఉంటూ వచ్చారు. 1982 మార్చి నుంచి ఇటీవల కాలం వరకు టీడీపీలోనే ఉన్నారు. 1982 నుంచి 2004 వరకు ఆలేరు నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు. 2009లో టంగుటూరు నుంచి టీడీపీ తరుపున ఎన్నికయ్యారు. దళిత వర్గ నాయకుడిగా ఆయనకు మంచి పేరు ఉంది.

అయితే టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుతో తనకు వచ్చిన విభేధాల కారణంగా ఆయన ఆ పార్టీని వీడారు. అయితే ఇప్పుడు ఆయన గనక బీజేపీలో చేరితో తెలంగాణ బీజేపీకి బలం చేకూరనుంది.

This post is also available in : English

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*