బీజేపీలో చేరిన దంగల్ టీం

న్యూఢిల్లీ: బాలీవుడ్‌లో దంగల్ సినిమా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. విమర్శకులను సైతం మైమరిపించింది. అలాంటి దంగల్ సినిమాను హర్యానాకు చెందిన పేరొందిన ప్రముఖ రెజ్లర్ మహావీర్ ఫోగట్ జీవితం ఆధారంగా తెరకెక్కించారు. ఆయనకు ఉన్న ఇద్దరు కూతుర్లు గీతా ఫోగట్, బబితా ఫోగట్‌‌లపై ప్రముఖంగా కథ నడించింది. ఈ చిత్రం ఎందరినో ఆకట్టుకుంది, స్ఫూర్తిదాయకంగా నిలిచింది.

అయితే ప్రస్తుతం హర్యానా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మహావీర్ ఫోగట్, ఆయన కూతురు బబితాఫోగట్ బీజేపీ పార్టీలో చేరారు. కామన్ వెల్త్ గేమ్స్‌లో మహిళల రెజ్లింగ్ పోటీలో బబితా ఫోగట్ రెండు సార్లు స్వర్ణ పతకం సాధించారు. హర్యానా రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి కిరెన్ రిజ్జు సమక్షంలో వీరు కషాయం కండువా కప్పుకున్నారు. ప్రస్తుతం హర్యానాలో ఉన్నది బీజేపీ ప్రభుత్వమే.

అయితే ఈ ఏడాది నవంబర్‌లో ఆ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రెజ్లింగ్ ఉద్దండులు బీజేపీలో చేరడం ఆ పార్టీకి చాలా పాజిటీవ్ అంశంగా మారింది. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమంటే 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు మహావీర్ ఫొగట్ స్థానిక రాజకీయ పార్టీ అయిన జననాయక్ జనతా పార్టీలో చేరారు. కానీ ఆ పార్టీ ఆయనకు టిక్కెట్ ఇవ్వలేదు.

 

“విజయ్ కుమార్”

This post is also available in : English

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*