ఫ్లైయింగ్ కిస్‌కి మూడేళ్ల జైలు శిక్ష

మొహాలి: ఒక యువకుడు చేస్తున్న ఆయతాయి చేష్టలకు కోర్టు గట్టి బుద్ధి చెప్పింది. ఒక వివాహితను లక్ష్యంగా చేసుకుని ఫ్లైయింగ్ కిస్సులు, అసభ్యంగా ప్రవర్తించడం చేస్తున్న యువకుడికి ఆమె గుణపాఠం నేర్పింది. పంజాబ్ రాష్ట్రం మొహాలిలో ఒక అపార్ట్‌మెంట్‌లో వినోద్ అనే యువకుడు ఉంటున్నాడు. అదే అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న ఒక వివాహత వైపు చూస్తూ ఆమె ఎప్పుడు కనిపించినా అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు.

దీంతో ఆ మహిళ తన భర్తకు విషయం చెప్పింది. అతను ఆ యువకుడిని హెచ్చరించాడు. అయినా అతని ప్రవర్తన మారకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరు పరిచారు. యువకుడిది తప్పని తేల్చిన కోర్టు మూడేళ్లు జైలు శిక్షతో పాటు మూడు వేల రూపాయల జరిమానా విధించింది.

This post is also available in : English

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*