పిచ్చివాడిగా మారబోతున్న ఫలక్‌నామా దాస్ హీరో!

హైదరాబాద్: “ఫలక్‌నామా దాస్” సినిమాతో పాపులర్ అయిన హీరో విశ్వక్ సేన్ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సాధించాడు. అందరి దృష్టిలో పడిన విశ్వక్ సేన్‌కు అవకాశాలు కూడా తన్నుకొస్తున్నాయి. మంచి మాస్ ఇమేజ్‌ను సొంతం చేసుకుని దూసుకొస్తున్న ఈ యువ హీరోతో మంచి పేరు సంపాదించుకున్న “లక్కీ మీడియా బ్యానర్” సినిమా తీయబోతోంది.

ఈ బ్యానర్‌లో అంతకుముందు టాటా బిర్లా మధ్యలో లైలా, మేం వయసుకు వచ్చాం, సినిమా చూపిస్తా మామా, తాజాగా హుషారు సినిమాలు వచ్చి సత్తా చాటాయి. లేటెస్ట్‌‌గా విశ్వక్ సేన్ ప్రధాన పాత్రలో మరో కొత్త సినిమాను తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. సినిమా పేరును పాగల్‌గా నిర్ణయించారు. ఫలక్‌నామా దాస్‌లో యాంగ్రీ యంగ్ మ్యాన్‌గా కనిపించిన విశ్వక్ సేన్ తన తర్వాత మూవీలో పాగల్‌గా కనిపించనున్నారు.

ఇదొక లవ్ స్టోరీ అని, ఒక మంచి ప్రేమ కథా సినిమాగా గుర్తుండిపోతుందని చిత్ర బృందం చెబుతుంది. సినిమా షూటింగ్ సెప్టెంబర్ నెలలో ప్రారంభం కానుందట.

This post is also available in : English

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*