హైదరాబాద్ ఆర్కే మఠ్‌లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

హైదరాబాద్: స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు నగరంలోని రామకృష్ణమఠం ముస్తాబైంది. వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్స్‌లెన్స్ ఆధ్వర్యంలో వేడుకలకు ఏర్పాట్లు చేశారు. యువతలో స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని పెంపొందించేలా యూత్ క్యాంప్ నిర్వహించనున్నట్టు నిర్వాహకులు తెలిపారు.

ఈ మేరకు ఆగస్ట్ 15న ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 గంటలకు వరకు క్యాంప్ జరగనుంది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కార్గిల్ యుద్ధ వీరుడు, దివంగత మేజర్ పద్మపాణి ఆచార్య సతీమణి చారులతా ఆచార్య హాజరుకానున్నారు. కాలేజీ విద్యార్థులు, యువ ఉద్యోగులందరూ ఆహ్వానితులేనని నిర్వాహకులు తెలిపారు.

This post is also available in : English

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*