భారత్‌పై ప్రేమ కురిపిస్తున్న ఇజ్రాయేల్!

న్యూఢిల్లీ: భారత దేశం ఎదుగుతున్న దేశమా, ఎదిగిన దేశమా? కొందరు ఎదుగుతున్న దేశం అంటే ఒప్పుకోరు. ప్రస్తుత భారత పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ ప్రాబల్యం మాత్రం పెరుగుతూ ఉంది. పక్క దేశాలతో పాటు పక్క ఖండాల దేశాలు కూడా భారత్‌ను పెద్దన్నగానే చూస్తున్నాయి. ముఖ్యంగా ఆసియాలో భారత స్థితి బాగా పెరిగింది.

భారత్‌కు శత్రు దేశాలు ఏవంటే ఇట్టే చెప్పేయవచ్చు. కానీ మిత్ర దేశాలు ఏవంటే మాత్రం కొంచెం ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. మొన్నటి వరకూ రష్యాను భారత్‌కు మిత్ర దేశంగా భావించిన పరిస్థితి ఉంది. కానీ అది కూడా తన అవసరార్ధం అన్న చందంగా ప్రవర్తించిన పరిస్థితులను చూశాం. ముఖ్యంగా చెప్పుకోవాలంటే రక్షణకు సంబంధించిన విషయాల్లో రష్యా అందించిన సహాయం భారత్ కంటే డబ్బుల పరంగా ఆ దేశానికే ఎక్కువ లాభం చేకూర్చింది అన్న వాదన కూడా ఉంది.

అయితే ఇక అమెరికా సంగతి తెలిసిందే. పక్కా బిజెనెస్ మైండ్ ఆ దేశానిది. అవసరమో, లాభమో ఉంటే తప్ప మాట సహాయమైనా చేయదు. స్వార్ధం బాగా చూసుకుంటుందని పేరుంది. మరో పక్క మన పక్కనే ఉన్న చైనా, పాకిస్థాన్ దేశాలు మనకు సమస్యగా మారాయి. చిన్న చిన్న దేశాల మైత్రితో బలం పెంచుకునే పరిస్థితిని కూడా చైనా అడ్డుకునేందుకు కుయుక్తులు పన్నుతుంది.

మరి ఈ పరిస్థితిలో భారత్‌కు నిజమైన ఫ్రెండ్ ఎవరంటే ఖచ్చితంగా చెప్పలేనప్పటికీ ప్రస్తుతం మాత్రం ఇజ్రాయేల్ ఆ స్థానంలో ఉందని చెప్పుకోవచ్చు. లాభం ఆసించకుండా సాయం చేస్తుంది ఆ దేశం అనుకునే పరిస్థితికి ఇరు దేశాల మైత్రి వచ్చింది. భారత్‌కు అన్ని విధాలా సాయం అందిస్తోంది.

రక్షణ రంగం అంవసరాలతో పాటు, సాంకేతికత, బిజినెస్, వ్యవసాయం, ఇలా అన్ని రకాలుగా భారత్‌కు ఇజ్రాయేల్ సాయం చేస్తుంది. అయితే ముఖ్యంగా చెప్పుకోవాల్సిన అంశం ఒకటుంది. తాజాగా భారత దేశం కశ్మీర్ విషయంలో ముఖ్యమైన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే కదా. ఆర్టికల్ 370, 35ఏ లను రద్దు చేసి రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విడగొట్టింది.

దీన్ని పాకిస్థాన్, చైనాలు వ్యతిరేకించగా కొన్ని ఇతర దేశాలు సమర్ధించాయి. కాశ్మీర్ విషయంలో భారత్ సరిగానే ప్రవర్తించింది అని రష్యా చెప్పింది. కశ్మీర్ విషయంలో మధ్యవర్తిత్వం వహించే ఉద్దేశం తమకు లేదని అమెరికా వెల్లడించింది. అయితే ఇజ్రాయేల్ మాత్రం శెభాష్ అనుకునేలా ఒక ప్రకటన చేసి అందరినీ భారతీయులను ఆకట్టుకుంది.

అదేమంటే కశ్మీర్ విషయంలో భారత్‌కు అన్ని విధాల సాయం చేస్తామని, ఒక వేళ యుద్ధ పరిస్థితులు సంభవిస్తే తమ దేశ సైన్యం మొత్తం వెళ్లి భారత్‌లో నిలబడుతుందని చెప్పింది. సాయం చేయడం చేయకపోవడం సంగతి పక్కనపెడితే అంత మాట అన్నందుకు పలువురు మేధావులు సైతం భారత్‌కు నిజమైన ఫ్రెండ్ ఇజ్రాయేల్ అని కీర్తిస్తున్నారు.

ఇజ్రాయేల్ ఎందుకిలా చేస్తుంది. చెప్పుకోవాలంటే, ఇజ్రాయేల్ ఒక క్రైస్తవ దేశం, యూదులకు అది ప్రసిద్ధి. హిట్లర్ కాలంలో యూదులను హిట్లర్ ఊచకోత కోస్తున్న సమయంలో చాలామంది యూదులకు భారత దేశం ఆశ్రయమిచ్చింది. ఈ సాయాన్ని దృష్టిలో పెట్టుకునే ఆ దేశం భారత్‌కు సహాయం చేస్తుందని కొందరు విశ్లేషకులు చెబుతున్నారు.

ఆసియాలో ఇజ్రాయేల్‌కు ఒక ఫ్రెండ్ అవసరం ఉంది. భారత్ రూపంలో దానికి మంచి ఫ్రెండ్ దొరికాడు అని మరికొందరు చెబుతున్నారు. ఈ అంశాలను పక్కన పెడితే ఇజ్రాయేల్ ప్రధానమంత్రి బెంజిమన్ నెతన్యాహు ప్రతి సందర్భానికి ట్విట్టర్‌లో భారతీయులకు, భారత ప్రధాని మోడీకి విషెస్ చెబుతున్నారు.

అంతకుముందు పలు సందర్భాల్లో థ్యాంక్యూ మోడీ, థ్యాంక్యూ ఇండియా అని ట్వీట్లు చేసిన ఇజ్రాయేల్ ప్రధాని ఆ మైత్రిని కొనసాగిస్తున్నారు. తాజాగా భారత్ 73వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటుంటే ఆయన ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. నా ఫ్రెండ్ మోడీకి, భారత ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు అని తెలిపారు. భారత్, ఇజ్రాయేల్ బంధం బలమైనది అని స్పష్టం చేశారు.

(విజయ్ కుమార్)

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*