2024 నాటికి తెలంగాణ బీజేపీదే: జెపీ నడ్డా

హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎంపికైన తర్వాత జెపి నడ్డా తొలిసారి తెలంగాణలో అడుగు పెట్టారు. ఆయన తెలంగాణ పర్యటనలో ఉండగా పలువురు కాంగ్రెస్, టీడీపీ నాయకులు ఆయన సమక్షంలో బీజేపీలో చేరారు. అందులో మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు ఉన్నారు.

అయితే ఈ సందర్భంగా జరిగిన ర్యాలీలో నడ్డా మాట్లాడుతూ 2024 నాటికి తెలంగాణలో బీజేపీ పాగా వేస్తుందని చెప్పారు. ఒకే దేశం ఒకే రాజ్యాంగం ఒకే జెండా ఉండాలనే ఉద్దేశంతో పీఎం మోడీ ఆర్టికల్ 370ని రద్దు చేశారని, కానీ కాంగ్రెస్ దాన్ని వ్యతిరేకిస్తోందని విమర్శించారు.

ఒకవేళ ఆర్టికల్ 370 అంత మంచిదైతే కాంగ్రెస్ పాలన కాలంలో దాన్ని ఎందుకు శాశ్వతం చేయలేదని నడ్డా ప్రశ్నించారు. ఒకానొక సమయంలో కాంగ్రెస్‌కు 400కు పైగా ఎంపీ సీట్లు ఉన్నాయని అప్పుడైనా మరి ఆర్టికల్ 370ని శాశ్వతం చేయాల్సిదని నడ్డా విమర్శించారు.

కాంగ్రెస్‌తో పాటు ఆయన టీఆర్ఎస్‌పై కూడా విమర్శలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టును ప్రస్తావిస్తూ టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు అంచనాలను భారీగా పెంచేసిందని, అవినీతి జరిగిందని విమర్శించారు. అంతేకాక ఇచ్చిన వాగ్ధానాల మేరకు నెరవేరుస్తామని చెప్పిన మిషన్ భగీరధ, మిషన్ కాకతీయ వంటి వంటినీ సరిగా అమలు చేయకుండా వదిలేశారని నడ్డా విమర్శించారు.

 

(విజయ్ కుమార్)

This post is also available in : English

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*