సైరా నరసింహా రెడ్డి అంటూ నినదించిన పవన్ కళ్యాణ్

చిరంజీవి, పవన్ కళ్యాణ్‌ను ఒకే స్టేజ్‌పైన చూడటమంటే అది అరుదనే చెప్పాలి. అలాంటిది పక్క పక్నే కనిపించారంటే అది ఆశ్చర్యకరమైన విషయమే. పవన్ సినిమాల్లో ఉన్నప్పుడే ఇది సర్‌ప్రైజ్ కలిగించే అంశం, మరి ఇప్పుడు పవన్ రాజకీయాల్లో కూడా ఉన్నారు. వారిద్దరు కలిసి ఉన్న వీడియో శరవేగంగా వైరల్ అవుతుంది. అది కూడా మామూలుగా కాదు. అన్న చిరంజీవి పక్కనే ఉండగా “సైరా నరసింహా రెడ్డి” అంటూ పవన్ గట్టిగా నినదించారు. అన్న మెగాస్టార్ పక్కనే నిలుచుని ఉండగా వీరత్వం ఉప్పొంగేలా గట్టిగా అరిచారు.

‘సైరా నరసింహా రెడ్డి’ పవన్ కళ్యాణ్ అంటూ పవన్ కళ్యాణ్ డబ్బింగ్ చెప్పిన వీడియో దృశ్యం ఇప్పుడు నెట్టింట్లో వైరల్‌గా మారింది. చిత్ర బృందం ఈ వీడియోను విడుదల చేసిన కొన్ని క్షణాల్లోనే విపరీతంగా సర్క్యులేట్ అవుతుంది.

ఆగష్టు 22వ తేదీన చిరంజీవి పుట్టిన రోజు. దీంతో బర్త్‌డే సందర్భంగా మూవీ టీజర్‌ను ప్రత్యేకంగా రూపొందించి విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ వాయిస్‌ను కూడా తీసుకున్నారు. ఆ టీజర్‌కు సంబంధించిన ప్రోమోను ఇప్పుడు విడుదల చేశారు. అయితే ఆగష్టు 22న మెగాస్టార్ పుట్టినరోజు అయితే అందుకు రెండు రోజులు ముందుగానే అంటే ఆగష్టు 20నే టీజర్‌ను విడుదల చేసేందుకు నిర్ణయించారు.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న సైరా నరసింహారెడ్డి తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ, హిందీ భాషల్లో భారీ స్థాయిలో విడుదల కాబోతోంది. తొలినాటి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవతం ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీలో అమితాబ్ బచ్చన్, జగపతిబాబు, నయనతార, విజయ్ సేతుపతి, కచ్చా సుదీప్, తమన్నా, నిహారిక తదితరులు నటిస్తున్నారు. కొణిదల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రామ్‌చరణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.

టీజర్ చిత్రీకరణ‌లో పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ ఇస్తున్న వీడియోలో పవన్ కారులో రావడం, చిరంజీవి రిసీవ్ చేసుకోవడం వంటివి చూపించారు. ‘సైరా నరసింహారెడ్డి’ అంటూ పవన్ కళ్యాణ్ డైలాగ్ చెప్పిన తర్వాత అన్నదమ్ములిద్దరూ ఒకరినొకరు కౌగిలించుకుని ఆనందం వ్యక్తం చేసుకున్నారు.

 

(విజయ్ కుమార్)

This post is also available in : English

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*