యాక్సిడెంట్ వార్త అవాస్తవం: హీరో తరుణ్

హైదరాబాద్: ప్రముఖ టాలీవుడ్ నటుడు, హీరో తరుణ్‌కు గత రాత్రి కారు యాక్సిడెంట్ జరిగింది. గాయాలు అయ్యాయి, యాక్సిడెంట్ అనంతరం తరుణ్ వేరే కారులో ఎక్కి సంఘటనా స్థలం నుంచి వెళ్లిపోయాడు. ఇలా నిన్నటి రాత్రి నుంచి సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మెయిన్ మీడియాలో కూడా వార్తలొచ్చాయి. దీంతో తరుణ్ స్వయంగా ఈ విషయంపై స్పందించాడు. తనకు యాక్సిడెంట్ అయినట్టు జరుగుతున్న ప్రచారం అవాస్తవమని స్పష్టం చేశాడు. తాను క్షేమంగా ఉన్నానని, తన కారు కూడా క్షేమంగానే ఉందని చెప్పాడు.

ఈ కారు యాక్సిడెంట్‌కు, ఆ వార్తలకు.. తనకూ ఎలాంటి సంబంధం లేదని తరుణ్ చెప్పాడు. పైగా నిన్నటి రాత్రి నుంచి తాను ఇంటి వద్దే ఉన్నట్టు తరుణ్ తెలిపాడు. దీంతో హీరో తరుణ్‌కు యాక్సిడెంట్ అయ్యిందా? అనుకుంటూ కంగారుపడుతున్న వారందరూ ఇప్పుడు హమ్మయ్య అనుకుంటున్నారు. వేగంగా ఉన్న సోషల్ మీడియాలో తమకు సంబంధించిన అవాస్తవాలు వైరల్ అవుతున్న సమయాల్లో సెలబ్రిటీలు ఇలా బయటకొచ్చి చెక్ పెట్టాల్సిన పరిస్థితి నెలకొంది.

 

(విజయ్ కుమార్)

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*