మెగాస్టార్ బర్త్ డే వేడుకకు చీఫ్ గెస్ట్‌గా పవర్‌స్టార్

ఆగస్టు 22న మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే. మెగాభిమానులందరికీ ఇది తెలిసిన విషయమే. అయితే ఈ సారి అన్నయ్య పుట్టినరోజు వేడుకల్లో సర్‌ప్రైజ్ ఉంది. అదే పవర్‌స్టార్ పవన్ కల్యాణ్. ప్రతి ఏటా మెగా ఫ్యాన్స్ నిర్వహించే మెగాస్టార్ బర్త్ డే వేడుకకు ఈ సారి పవన్ కల్యాణ్ ముఖ్య అతిథిగా రాబోతున్నారు. మెగాభిమానులకు కనువిందు చేయబోతున్నారు.

ఆగస్టు 21న సాయంత్రం 6 గంటలకు శిల్పకళావేదికలో అంగరంగ వైభవంగా నిర్వహించే చిరంజీవి జన్మదిన వేడుకకు ఈ సారి పవన్ కల్యాణ్ వస్తుండడంతో భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*