సర్‌ప్రైజ్.. సైరా నరసింహారెడ్డిలో రజనీకాంత్, మోహన్‌లాల్!

చెన్నై: మెగాస్టార్ చిరంజీవి 151వ చిత్రం సైరా నరసింహారెడ్డి మూవీ ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. అక్టోబర్ రెండో తేదీన విడుదల చేసేందుకు చిత్ర బృందం సన్నద్ధమైంది. అయితే ఈ క్రమంలో చిరు పుట్టిన రోజు(ఆగష్టు 22)కి రెండు రోజుల ముందుగా మూవీ టీజర్‌ను విడుదల చేశారు. టీజర్ అదరిపోయింది, మెగాస్టార్ నట విశ్వరూపం చూపించారు.

బ్రిటీష్ వాళ్లకు వ్యతిరేకంగా పోరాడిన తొలితరం నాయకుడు ఈ సైరా నరసింహారెడ్డి. గుర్తింపు లేకుండా కనుమరుగైన ఈ నయకుడి జీవితం ఆధారంగానే సైరా నరసింహారెడ్డి మూవీ తీస్తున్నారు.

అయితే మూవీలో అమితాబ్ బచ్చన్ వంటి మహానటుడు కూడా ప్రముఖ పాత్ర పోషిస్తోన్న సంగతి తెలిసిందే. ఆయన చిరంజీవికి మార్గదర్శకుడు, గురువు పాత్ర పోషించారని తెలుస్తోంది. అయితే ఇక్కడ మరో సర్‌ప్రైజ్‌ను చిత్ర బృందం ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతోంది.

అదేమంటే.. సూపర్ స్టార్ రజనీకాంత్, మళయాళ మెగాస్టార్ మోహన్‌లాల్‌ను కూడా ఇన్వాల్వ్ చేయబోతున్నట్టు సమాచారం. అయితే వీరు నేరుగా మూవీలో నటించడంలేదు కానీ వారి వాయిస్‌ను ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది.

ఈ సైరా నరసింహారెడ్డి మూవీ తెలుగుతో పాటు తమిళం, కన్నడం, మళయాళం, హిందీ భాషల్లో ఒకేసారి విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తమిళ వర్షన్‌లో చిరంజీవికి రజనీకాంత్ వాయిస్, మళయాళం వర్షన్‌లో మోహన్‌లాల్ వాయిస్‌ను తీసుకోవాలని ప్లాన్ చేస్తున్నారట.

ఒకవేళ ఇదే నిజమైతే ఒకే మూవీలో ముగ్గురు మెగాస్లార్లు నటించినట్టే అనుకోవచ్చు. ఇది ఫ్యాన్స్‌కు పండగలాంటి వార్త అవుతుంది. “సైరా నరసింహారెడ్డి” మూవీని కొణిదల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రామ్‌చరణ్ నిర్మిస్తుండగా, సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు.

 

(మెగా విశ్వరూపం.. అదిరిపోయిన సైరా టీజర్)

 

(విజయ్ కుమార్)

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*