పెద్ద పొరపాటు చేసిన రష్మిక, నిర్మాతలు ఆగ్రహం

చెన్నై: తెలుగులో వరుస హిట్లతో దూకుడు మీద ఉన్న హీరోయిన్ రష్మిక మంథన. మంచి సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఈ జోష్‌లోనే తమిళనాట తన సత్తాను నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే తమిళ హీరో కార్తీ సరసన కొత్త సనిమాను చేస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రారంభ దశలోనే ఉంది. మూవీ పేరును ఇంకా ప్రకటించలేదు.

అయితే ఈ లోపు రష్మిక ఒక పెద్ద పొరపాటే చేసింది. ఈమె చేసిన ఆ పొరపాటుకు నిర్మాతలు కన్నెర్ర చేస్తున్నారు. రష్మికపై ఆగ్రహంతో ఉన్నారు. ఇంతకీ రష్మిక చేసిన పొరపాటు ఏమంటే ఇంకా ఎవరూ మూవీ పేరును బయటపెట్టకుండానే తానే స్వయంగా చెప్పేసింది. సోషల్ మీడియాలో ప్రతి విషయాన్ని అప్‌డేట్ చేస్తూ ఫ్యాన్స్‌కు దగ్గరగా ఉండటం ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ కదా.. దాన్ని ఈ హీరోయిన్ ఫాలో అయ్యింది.

దీంతో తమకు చెప్పకుండా సినిమా పేరును అలా ఎలా చెప్పేస్తావంటూ చిత్ర నిర్మాతలు ఆగ్రహంగా ఉన్నారట. అసలే వాళ్లు సినిమా పేరును భారీ స్థాయిలో వెల్లడి చేయాలని ప్లాన్ చేసుకుని ఉన్నారట. మరి రష్మిక ఏమో తన సోషల్ మీడియాలో ‘సుల్తాన్’ సినిమా చిత్రీకరణలో నాలుగవరోజు అంటూ ఒక ఫొటోను కూడా పోస్ట్ చేసింది. దీంతో ఆ సినిమా టైటిల్ వెల్లడి అయిపోవడంతో అంతా అవాక్కయ్యారు.

 

(విజయ్ కుమార్)

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*