నేను క్షేమంగానే ఉన్నాను: రాజ్ తరుణ్

హైదరాబాద్: కారు ప్రమాద ఘటనపై హీరో రాజ్ తరుణ్ స్పందించారు. తాను క్షేమంగానే ఉన్నానని తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. అసలు ఏమి జరిగింది? ప్రమాదం జరిగిన తర్వాత ఎక్కడికి వెళ్లారనే విషయాలను ఆయన వివరించాడు.

కారు ప్రమాద ఘటన తర్వాత తన యోగ క్షేమాలు తెలుసుకునేందుకు తనకు చాలా ఫోన్ కాల్స్ వస్తున్నాయని రాజ్ తరుణ్ చెప్పాడు. తన పట్ల ప్రేమాభిమానాలు చూపిన ప్రతి ఒక్కరికీ ధర్యావాదాలు అని చెప్పాడు.

గత మూడు నెలల నుంచి ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్న నార్సింగ్ ప్రాంతం గుండా ఇంటి నుంచి వెళుతున్నాను. అయితే సెడన్‌గా రైట్ తీసుకోవాల్సి వచ్చింది. ఆ సమయంలో నేను కంట్రోల్ కోల్పోయి రోడ్డు పక్కనే ఉన్న గోడను ఢీకొట్టాను. ఆ సౌండ్‌కు నా కళ్లు బైర్లు కమ్మాయి, నా చెవులు పనిచేయలేదు. గుండె వేగం పెరిగింది. నాకు ఆ సమయంలో సీట్ బెల్ట్ ఉంది, వెంటనే నన్ను నేను చెక్ చేసుకుని వెంటనే ఇంటికి పరిగెత్తాను.

ఆరోజు జరిగింది ఇదే. ఇప్పుడు నేను విశ్రాంతి తీసుకుంటున్నాను. అందుకే బయటకు రాలేదు, కొన్ని రోజుల్లో మళ్లీ నా షూటింగ్ నేను ప్రారంభిస్తాను అంటూ రాజ్ తరుణ్ వివరించాడు.

 

(విజయ్ కుమార్)

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*