అరుణ్ జైట్లీ కన్నుమూత

న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, మాజీ కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ కన్నుమూశారు. ఆయన వయసు 66 సంవత్సరాలు. న్యూఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స తీసుకుంటూ ఆయన కన్నుమూశారు. నేడు అనగా ఆగష్టు 24వ తేదీన మధ్యాహ్నం 12:07 నిమిషాలకు ఆయన కన్నుమూసినట్టు ఎయిమ్స్ వైద్యులు ప్రకటన విడుదల చేశారు.

గత కొన్ని రోజులుగా ఆయన ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. గత రెండు సంవత్సరాలుగా ఆయనకు ఆరోగ్యం బాగుండటం లేదు. గతేడాది(2018లో) ఆయన కిడ్నీ మార్పిడి చేయించుకున్నారు. ఇందుకోసం ఆయనను ఐసీయూలో పెట్టవలసి వచ్చింది. అంతకుముందు 2014లో బరియాటిక్ సర్జరీ జరిగింది. ఆయనకు డయాబెటిక్ వ్యాధి ఉండటంతో బరువు పెరిగారు, అందువల్లనే బరియాటిక్ సర్జరీ చేయించుకున్నారు.

ప్రధాని నరేంద్ర మోడీ మొదటి పర్యాయం పాలనలో జైట్లీ ఆర్ధిక మంత్రిగా పని చేశారు. అయితే 2019 ఎన్నికల్లో మాత్రం ఆయను క్రియాశీలక రాజకీయాల్లో ఉండలేనని కోరుతూ ప్రధాని మోడీకి లేఖ రాశారు. అరుణ్ జైట్లీ వృత్తి రీత్యా లాయర్. ఇందిరాగాంధీ హయాంలో ఎమర్జెన్సీ కాలంలో ఆయనను జైలుకు కూడా వెళ్లారు. ఆ టైంలో ఆయన స్టూడెంట్ లీడర్‌గా ఉండేవారు. ఆ తర్వాత కొంత కాలానికి అప్పటి జనసంఘ్ పార్టీలో చేరారు. తర్వాత కాలంలో అది బీజేపీగా అవతరించింది.

 

(విజయ్ కుమార్)

This post is also available in : English

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*