వీఐహెచ్ఈ ఫౌండేషన్ డే సెలబ్రేషన్స్‌కు సర్వం సిద్ధం

హైదరాబాద్: రామకృష్ణ మఠంలోని వివేకానంద ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ 20వ ఆవిర్భావ దినోత్సవానికి సన్నద్ధమవుతోంది. ఈ నెల 9, 10, 11 తేదీలలో మూడు రోజుల పాటు ఉత్సవాలు జరగనున్నాయి. సుప్రసిద్ధ వక్తలతో స్ఫూర్తిదాయక ఉపన్యాసాలు, యువత ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు నిర్వాహకులు తెలిపారు.

సదస్సు తొలిరోజు సమావేశానికి ఇంజినీరింగ్ కాలేజీల యాజమాన్యాలు, ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు హాజరవుతున్నారు. ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ చైర్మన్ ప్రొఫెసర్ డి. సహస్రబుద్ధే, పద్మశ్రీ చింతకింద మల్లేశం, ప్రముఖ విద్యావేత్త విజయ్ మీనన్, డెక్స్ గ్లోబల్ సీఈవో శరద్ సాగర్ పాల్గొంటున్నారు.

ఇక రెండో రోజు ఇంజినీరింగ్ కాలేజీల విద్యార్థులు, వివిధ రంగాలకు చెందిన యువతీయువకులు పాల్గొంటారు. రాచకొండ సీపీ మహేశ్ భగవత్, విద్యావేత్త విజయ్ మీనన్, ఐఏఎస్ నవీన్ మిట్టల్, డెక్స్ గ్లోబల్ సీఈవో శరద్ సాగర్, సీనియర్ జర్నలిస్ట్ రాకా సుధాకర్ ప్రసంగించనున్నారు. నిర్భయం, మానసిక స్థైర్యం, వ్యక్తిత్వం తదితర అంశాలపై వక్తలు మాట్లాడతారు.

మూడో రోజు సదస్సులో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, గ్లోబల్ హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ కేఎస్ రత్నాకర్, వివేకానంద ఇన్ స్టిట్యూట్ ఆఫ్ లాంగ్వేజెస్ డైరెక్టర్ స్వామి శితికంఠానంద, విద్యావేత్త విజయ్ మీనన్ మాట్లాడనున్నారు. చికాగో ప్రసంగం 125వ వార్షికోత్సవ ముగింపు కార్యక్రమంగా చివరి రోజు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ మూడు రోజుల సదస్సుకు రామకృష్ణమఠం అధ్యక్షులు స్వామి జ్ఞానానంద అధ్యక్షత వహించనున్నారు. వక్తల ప్రసంగాల ఉదయం 10 నుంచి 2 గంటలకు వరకు సాగుతాయి. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.

చివరిరోజు ట్యాంక్ బండ్ మీద ఉన్న వివేకానందుల విగ్రహానికి పూలమాల వేసి రామకృష్ణ మఠం వరకు పాదయాత్ర చేయనున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*