“వైయస్సార్ ఛాయలో” పుస్తకావిష్కరణ

హైదరాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డికి సంబంధించి రచించిన “వైయస్సార్ ఛాయలో…” అనే పుస్తక ఆవిష్కరణ సెప్టెంబర్ నెల 8వ తేదీన జరగనుంది. ఆదివారం ఉదయం 11 గంటలకు కార్యక్రమం ప్రారంభమౌతుంది. హైదరాబాద్‌లోని మైత్రివనం సెంటర్ నందు ఉన్న ఆదిత్య ట్రేడ్ సెంటర్ భవన సముదాయంలో గల హోటల్ ఆదిత్య పార్క్‌లో ఈ పుస్తకావిష్కరణ వేడుక జరుగుతుంది.

ఈ పుస్తకాన్ని సీనియర్ జర్నలిస్టులు, వైయస్సార్‌కు ఛీఫ్ పీఆర్‌ఓ‌గా పని చేసిన జి. వల్లీశ్వర్‌ రచించారు. ఈయనకు జర్నలిజంలో సుదీర్ఘ అనుభవం ఉంది. వైయస్సార్‌తో అత్యంత సన్నిహిత సంబంధాలు ఉండేవి. రచ్చబండ కార్యక్రమానికి వెళుతూ దుర్మరణం చెందడానికి ముందు వైయస్సార్‌తో మాట్లాడిన వారిలో ఈయన కూడా ఉన్నారు.

ఈ పుస్తకాన్ని పద్మభూషణ్ గ్రహీత, ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘం అధ్యక్షులు డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమానికి ఆయనే ముఖ్య అతిధి. ఆయనతో పాటు ఇంకా పలువురు ప్రముఖులు పాల్గొనబోతున్నారు. వైయస్సార్ ప్రభుత్వంలో కీలకపాత్రలు నిర్వహించిన అప్పటి ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె.వి.పి రామచంద్రరావు (ఎంపి, రాజ్యసభ), మాజీ పార్లమెంట్ సభ్యులు ఉండవల్లి అరుణ్ కుమార్ పాల్గొంటారు.

ఇప్పటి తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె.వి రమణాచారి (IAS, Retd), శ్రీ.కె. ప్రభాకరరెడ్డి (IAS, Retd), డాక్టర్ కె.వి రావు (IAS, Retd), ఇంకా ముఖ్యంగా సీనియర్ పాత్రికేయులు ‘సాక్షి’ పూర్వపు ఎడిటోరియల్ డైరెక్టర్ శ్రీ కె. రామచంద్రమూర్తి కూడా పాల్గొంటారు.

This post is also available in : English

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*