యాలాల్ మండలంలో 13 మంది ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం..

తాండూర్: వికారాబాద్ జిల్లా యాలాల్ మండలంలో పనిచేసే ప్రభుత్వ ఉపాధ్యాయుల్లో 13 మందిని ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేసి సన్మానించారు. అంకితభావంతో విశిష్ట సేవలందించినందుకుగానూ యాలాల్ మండలం నుంచి మొత్తం 13 మందిని ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేశారు. ఇందులో 9 మంది సెకండరీ స్కూల్ టీచర్లు ఉన్నారు. ఇద్దరు స్కూల్ అసిస్టెంట్లు, ఇద్దరు కేజీబీవీ స్కూల్స్‌కు చెందిన టీచర్లున్నారు.

పగిడియాల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఆరెపాటి మీనాక్షికి బెస్ట్ టీచర్ అవార్డ్ వచ్చింది. అవార్డు తమపై మరింత బాధ్యత పెంచిందని మీనాక్షి చెప్పారు. అగ్గనూర్‌ జిల్లాపరిషత్ హైస్కూల్‌లో పనిచేసే ఈ ప్రభాకర్‌కు కూడా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు లభించింది. బెస్ట్ టీచర్ అవార్డు పొందినవారిలో గులాబ్ సింగ్, నరేశ్ కుమార్, అరుణ జ్యోతి, అంబదాస్, వెంకట్రాములు, స్రవంతి, రవికుబార్, సుజాత, మంజుల, కృష్ణవేణి తదితరులు ఉన్నారు. యాలాల్‌లో జరిగిన కార్యక్రమంలో ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. టీచర్ల కుటుంబ సభ్యులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*