రామకృష్ణ మఠంలో ఈ నెల 22న యూత్ లీడర్‌షిప్ సదస్సు

హైదరాబాద్: రామకృష్ణ మఠంలో ఈ నెల 22న ‘యూత్ లీడర్‌షిప్ రెస్పాన్సిబిలిటీస్'(యువ నాయకత్వం బాధ్యతలు) పేర ప్రత్యేక సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు డెక్సెటెరిటీ గ్లోబల్ వ్యవస్థాపకులు, సిఈఓ అయిన శరద్ వివేక్ సాగర్ ప్రత్యేక అతిథిగా హాజరౌతున్నారు. బీహార్ రాజధాని పాట్నాకు చెందిన ఈయన తన సందేశాత్మక ప్రసంగాలతో యువతరానికి ఆదర్శప్రాయుడిగా మారిపోయారు. సదస్సులో శరద్ సాగర్ ప్రసంగిస్తారని వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ డైరక్టర్ స్వామి బోధమయానంద తెలిపారు. సదస్సుకు హాజరయ్యే కాగ్నిజెంట్ టెక్నాలజీ సొల్యూషన్స్ సీనియర్ డైరక్టర్ ప్రత్యూష కూడా ప్రసంగిస్తారని బోధమయానంద తెలిపారు.

కార్యక్రమంలో కార్గిల్ హీరో మేజర్ పద్మపాణి ఆచార్య కుమార్తె అపరాజిత ఆచార్య కూడా పాల్గొంటున్నారు.

ఈ కార్యక్రమానికి సంబంధించి రిజిస్ట్రేషన్ల ప్రక్రియ జోరుగా సాగుతోంది. ఉదయం పది నుంచి మధ్యాహ్నం రెండు వరకూ సాగే ఈ సదస్సులో పాల్గొనేందుకు ఇప్పటికే యువత పెద్ద సంఖ్యలో రిజిస్టర్ చేసుకున్నారు.

 

మరిన్ని వివరాలకు వివేకానంద ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యూమన్ ఎక్సలెన్స్ కార్యాలయం ఫోన్ నెంబర్ 040 27627861కు ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చని సంస్థ నిర్వాహకులు తెలిపారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*