కమెడియన్ వేణు మాధవ్ ఇక లేరు

తెలుగు చిత్రసీమలో కమెడియన్‌గా తనదైన ముద్రను వేసుకున్న ప్రముఖ హాస్య నటుడు వేణు మాధవ్ ఇక లేరు. కాలేయ మరియు కిడ్నీ సంబంధ వ్యాధితో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచినట్లుగా సికింద్రాబాద్ యశోదా ఆసుపత్రి వైద్యులు తెలిపారు.

నల్ల బాలు నల్ల త్రాచు లెక్క అంటూ తన కామెడీతో కడుపుబ్బా నవ్వించిన వేణుమాధవ్, స్టార్ కమెడియన్‌గా ఎన్నో విజయవంతమైన చిత్రాలలో నటించారు. కమెడియన్‌గానే కాకుండా హీరోగా కూడా చేసి ఆయన మెప్పించారు. హంగామా, భూ కైలాస్, ప్రేమాభిషేకం వంటి చిత్రాలలో హీరోగా ఆయన తనదైన నటనతో ఆకట్టుకున్నారు. ‘సంప్రదాయం’ చిత్రంతో సినీ ఎంట్రీ ఇచ్చిన వేణుమాధవ్ కమెడియన్‌గా ఎన్నో చిత్రాలలో నటించి ప్రేక్షకులను నవ్వించారు.

‘ఆది, సింహాద్రి, సై, మాస్, ఛత్రపతి, లక్ష్మీ, పోకిరి, అన్నవరం, బృందావనం మొదలగు చిత్రాలలోని పాత్రలు వేణుమాధవ్‌కు మంచి పేరును తెచ్చిపెట్టాయి. ఆయన మరణం చలనచిత్ర పరిశ్రమకు తీరనిలోటు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటూ తెలుగు సినీ, రాజకీయ ప్రముఖులు ప్రగాడ సంతాపం తెలిపారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*