కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ భేటీ

న్యూఢిల్లీ: కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాతో ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరక్టర్  రాధాకృష్ణ భేటీ అయ్యారు. అమిత్ షా ఆహ్వానం మేరకు ఆయన ఢిల్లీ వెళ్లారు. షా నివాసంలో గంటన్నరపాటు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా షా ఆర్టికల్‌ 370 రద్దుపై రాధాకృష్ణకు వివరించారు. తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పరిస్థితులపై కూడా అమిత్‌ షా ఆరా తీశారు. ఏపీలో ఏబీఎన్‌ ఛానల్‌ నిలిపివేతపై ఆయన రాధాకృష్ణను అడిగి వివరాలు తెలుసుకున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*