ఆకట్టుకుంటోన్న బొమ్మల కొలువు

హైదరాబాద్: కూకట్‌పల్లి వసంత్ నగర్‌కు చెందిన అత్తాకోడళ్లు రమణి ప్రకాశ్, తేజస్వీ ప్రమోద్ ‘బొమ్మల కొలువు’ ఏర్పాటు చేశారు. శ్రీకృష్ణ చరిత్ర తెలిసేలా బొమ్మల కొలువును తీర్చిదిద్దారు. ఏటా ఏదో ఒక అంశాన్ని తీసుకుని ‘బొమ్మల కొలువు’ ద్వారా పిల్లలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఏడాది శ్రీకృష్ణుడి జీవితాన్ని కళ్లకు కట్టేలా బొమ్మల కొలువు ఏర్పాటు చేశారు.

4 సంవత్సరాలుగా వీరు ఇదే తరహాలో చేస్తున్నారు. గతంలో శ్రీనివాస కళ్యాణం, జూ పార్క్, రామాయణం, మహాభారతం వంటి వైవిధ్య భరితమైన అంశాలను ఎంచుకున్నారు. వీరు ఏర్పాటు చేసిన బొమ్మల కొలువును చూసేందుకు చుట్టుపక్కల వారు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. ముఖ్యంగా చిన్నారులు బొమ్మల కొలువు చూసి కేరింతలు కొడుతున్నారు.

అత్త రమణి ఉపాధ్యాయురాలు కాగా, కోడలు తేజస్వి ఆర్థిక నిపుణురాలు. వీరి సృజనాత్మకతను అంతా మెచ్చుకుంటారు. సంస్కృతీ సంప్రదాయాలను కాపాడేందుకు మంచి ప్రయత్నం చేస్తున్నారని కొనియాడుతున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*