కుక్కకు గుడి

కుక్కకు గుడి

అవును వారికి కుక్కనే దేవుడు
ఆ ఊరిని కాపాడే రక్షకుడు కూడా

కర్ణాటక రాజధాని బెంగళూరుకు 60కిలోమీటర్ల దూరంలోని రాంనగర్ జిల్లా చెన్నపట్నంలోని అగ్రహార వళగెరె హళ్లిలో కొన్నేళ్లుగా కుక్కును దేవుడిగా పూజిస్తున్నారు. గుడి కట్టి, విగ్రహాలు పెట్టి.. అభిషేకాలు చేస్తున్నారు.

ఒకసారి ఆ గ్రామానికి చెందిన రెండు కుక్కలు కనిపించకుండా పోయాయి. అప్పుడు గ్రామ దేవత కెంపమ్మ ఒక గ్రామస్థుడి కలలో కనిపించి తనకు ప్రీతిపార్థమైన ఆ శునకాలకి గుడి కట్టించి పూజించమని, అవే ఊరిని కాపాడతాయని చెప్పిందట. దీనితో 2010లో ఈ శునకాలయాన్ని నిర్మించారు. కనిపించకుండా పోయిన కుక్కల విగ్రహాలను ప్రతిష్టించారు. ప్రతి ఏడాది జాతర కూడా చేస్తారు.

విశ్వాసానికి మారుపేరైన శునకం ఊరిలో ఏ తప్పు జరగకుండా చూసుకుంటుందని, గ్రామ దేవతకు తోడుగా తమను కాపాడుతుందని గ్రామస్థులు నమ్ముతున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*